జోష్‌పుల్‌గా జననేత జన్మదినం

తాండూరు రాజకీయం వికారాబాద్

జోష్‌పుల్‌గా జననేత జన్మదినం
– జయప్రదం చేసిన గులాబీనేతలు
– నేతలు, ప్రజలందరికి కృతజ్ఞతలు
– బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశ్‌ కి నేత, జననేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు తాండూరులో జోష్‌పుల్‌గా జరిగాయని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. జన్మదిన వేడుకలను జయప్రదం చేసిన నేతలకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 36 వార్డుల్లో సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతివార్డులో వార్డు అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొని కేసీఆర్‌ బర్త్‌ డే కేక్‌ కట్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి వార్డులో ఉన్న దేవాలయాలు, చెర్చ్‌లు, మసీదు, దర్గాలలో ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేయడం జరిగిందన్నారు. జననేత కేసీఆర్ జన్మదిన వేడుకలను జయప్రదం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు విజయదేవి, మంకాల రాఘవేందర్, అస్లాం, ముక్తార్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్, సంతోష్‌ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, నరేందర్ గౌడ్, దేవాలయాల చైర్మన్లు బంటారం సుధాకర్, రాజన్ గౌడ్, సంజీవరావు, మురళీ, దర్గా కమిటి సభ్యులు, మత పెద్దలు, ప్రజా ప్రతినిధులకు, అనుబంధ సంఘాల ప్రతినిధులకు, యువ నాయకులకు, మహిళా నాయకులకు, రోహిత్ అన్న యువ సైన్యం సభ్యులకు, ప్రజాబంధు సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్తను సమర్పించిన వారు…