పాప‌న్న గౌడ్ విగ్ర‌హాన్ని పెట్టి తీరుతాం

తాండూరు రాజకీయం వికారాబాద్

పాప‌న్న గౌడ్ విగ్ర‌హాన్ని పెట్టి తీరుతాం
– కౌన్సిల్‌లో తీర్మానం చేసి, క‌లెక్ట‌ర్‌ను కలుస్తాం
– తాండూరు గౌడ సంఘం నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంతో పాటు గ్రామాల్లో కూడ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ ఏర్పాటు చేస్తామ‌ని గౌడ సంఘం నాయ‌కులు పేర్కొన్నారు. శుక్ర‌వారం తాండూరు గౌడ సంఘం అధ్య‌క్షులు రాజుగౌడ్ ఆధ్వ‌ర్యంలో సంఘం పెద్ద‌లు, నాయ‌కులు తాండూరు డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన దిమ్మెను కూల్చివేత‌కు పాల్ప‌డిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అనంత‌రం గౌడ సంఘం అధ్య‌క్షులు రాజుగౌడ్, పెద్ద‌లు ర‌వీంద‌ర్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణంలో మున్సిప‌ల్ అధికారులు పాప‌న్న గౌడ్ విగ్ర‌హా దిమ్మెను కూల్చి వేశార‌ని, దీనిపై కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. పండ‌గ స‌మ‌యాల్లో అలాంటి వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌న్నారు. తాండూరు మున్సిప‌ల్‌లో కౌన్సిల్ తీర్మానం తీసుకుని, వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లుస్తామ‌న్నారు. అన్ని అనుమ‌తుల‌తో ప‌ట్ట‌ణంలో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి తీరుతామ‌న్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడ పాప‌న్న గౌడ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేలా చూస్తామ‌న్నారు. ప‌ట్ట‌ణంలో విగ్ర‌హ దిమ్మెను కూల్చివేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర‌మంలో గౌడ సంఘం నాయ‌కులు న‌ర్స‌య్య గౌడ్, గీత కార్మిక సఘం అధ్య‌క్షులు హ‌రిహ‌ర‌గౌడ్, కౌన్సిల‌ర్లు ప్ర‌భాక‌ర్ గౌడ్, ప్ర‌వీణ్ గౌడ్, వెంక‌న్న‌గౌడ్, చైర్మ‌న్ రాజన్‌గౌడ్, నాయ‌కులు సుద‌ర్శ‌న్ గౌడ్, సంతోష్ గౌడ్ త‌దిత‌రులు ఉన్నారు.