సీఎం కుటుంబానికి జైలు ఖాయం
– రాష్ట్రంలో అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
– దళితుడనే సాయన్న అంత్యక్రియలపై వివక్ష
– వరంగల్, యాలాల సంఘటనలపై స్పందించాలి
– మనషుల ప్రాణాలంటే కుక్కలకంటే హీనమా..?
– సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ ధ్వజం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. వారి అవినీతి ఆధారాలు దొరికిన వెంటనే దొంగలకు జైలుకు పంపిస్తామన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులోని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దోపిడి దొంగలు భూకబ్జాదారులకు బీఆర్ఎస్ పార్టీ అండదండలు అందిస్తున్నారు. రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని పోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో కుక్కలు పిల్లలను చంపుతుంటే. బీఆర్ఎస్ నేతలు మనసులపై దాడులు చేస్తున్నారని అన్నారు. వరంగల్ యూనివర్సీలో యువతి ఆత్మహత్యయత్నంపై గాని, వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో అర్థకావడం లేదన్నారు. హైదరాబాద్లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణిస్తే కూడ స్పందించలేదని విమర్శించారు. కేసీఆర్ ఫాంహస్ లో కుక్కలకు ఉన్న విలువ మనుషుల ప్రాణాలకంటే హీనంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో తాగి, తినడం తప్ప ఏం చేయడంలేదని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాయన్న దళితుడు కావడంతోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించలేదన్నారు. అదే నిరంకుశ నిజాం నవాబు మరణిస్తే లాంచనాలతో నిర్వహించారని గుర్తుచేశారు. గతంలో మంత్రి కేటీజర్ ను ముఖ్యమంత్రిని చేయాలని చేపట్టిన సంతకాల సేకరణలో సాయన్న వ్యతిరేకంగా ఉన్నందుకే కుమారుడి కోరిక మేరకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదన్నారు. దీనిపై సాయన్న ఆత్మ ఘోసిస్తుందన్నారు. ఈ సంఘటనపై దళిత సంఘాలు ఆవేధన చెందుతున్నాయన్నారు. కాని సీఎం కేసీఆర్ మోచేతి యూనియన్లకు మాత్రమే న్యాయం జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతమంది ప్రాణాలు పోతే సీఎం కేసీఆర్ స్పందిస్తారో చెప్పాలన్నారు. వరంగల్, వికారాబాద్ జిల్లా యాలాల ఘటన, సాయన్న అంత్యక్రియలతో పాటు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయమన్నారు. పక్కా ఆధారాలను సేకరించి.. జైలుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు బీజేపీ దళితుల సంక్షేమంలో భాగంగా అంబేద్కర్ ప్రాంతాలను స్పూర్తి కేంద్రాలుగా తీర్చిదిద్దుతుందన్నారు. 1లక్ష 25 వేల బ్యాంకుల్లో ఎస్సీ, ఎస్సీ యువకులకు రూ.కోటి వరకు రుణాలు అందిస్తూ ఇతరుల ఉపాధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. అదేవిధంగా బీజేపీ 12 మంది ఎస్సీ వర్గానికి ఎంపీలను మంత్రులను చేసిందని, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన రాంనాథ్ కోవింద్ ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిలను చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పార్టీ కవి టీల నిర్ణయం మేరకు ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఏసీఆర్, జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి, మాజీ అధ్యక్షులు కరణం ప్రహల్లాద్ రావు, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

