పెళ్లిచేసుకుంటానని మోసం..!
– న్యాయం కోసం పురుగుల మందు తాగిన యువతి
– పెద్దేముల్ పోలీస్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటానని మోసం వ్యక్తి వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే తనకు న్యాయం చేయడంలేదంటూ ఓ యువతి మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్టేషన్ ముందే పురుగుల మందు సేవించి ఘాతుకానికి పాల్పడింది. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కలకలంరేపింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలానికి చెందిన యువతిని గత రెండేళ్ల క్రితం వరుసకు మామ అయ్యే అంజయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అప్పటి నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతున్నారు. రెండేళ్లు పూర్తి కావడస్తుండడంతో పెళ్లి చేసుకోవాలని యువతి నిందితున్ని నిలదీసింది. ఇందుకు అంజయ్య నిరాకరించడంతో పెద్దేముల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ యువతి ఆరోపిస్తూ సోమవారం పెద్దేముల్ పోలీస్టేషన్ వద్ద పురుగుల సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పోలీసులు యువతి చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.

