పాపన్నగారి మాణిక్‌రెడ్డిని గెలిపించాలి
– తాండూరులో టీఎస్‌యూటీఎఫ్ జోరుగా ప్రచారం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డిని గెలిపించాలని టీఎస్‌యూటీఎఫ్, ఉపాధ్యాయ, అద్యాపక సంఘాల నాయకులు కోరారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో సంఘం నాయకులు టీచర్ల ఇంటింటికి వెళ్లి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పాపన్నగారి మాణిక్ రెడ్డి కృషి చేస్తారని, కావున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వరుస సంఖ్య 17 పాపన్నగారి మాణిక్ రెడ్డి పేరు ఉంటుందని, అక్కడ 1మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఎఫ్ తాండూరు మండల అధ్యక్షులు నారాయణ గౌడ్, సెక్రెటరీ వెంకటేశం, సభ్యులు వెంకటప్ప, పెద్దేముల్ మండల సీనియర్ కార్యకర్త డి శ్రీనివాస్, తాండూరు మండల ట్రెజరర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

