ఏడంటే.. ఏడే..!
– మున్సిపల్ ప్రజావాణి ఫిర్యాదులు
– అత్యధికం ఏమున్నాయంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఏడంటే.. 7 పిర్యాదులు అందాయి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు గత వారం నుంచి తాండూరు మున్సిపల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఉదయం 10-30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిని నిర్వహించారు. ఈ ప్రజావాణిలో మేనేజర్ నరేందర్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 7 ఫిర్యాదులు అందగా ఇందులో ఒకటి పారిశుద్ధ్యం, మిగతా ఆరు ఆసరా ఫించన్‌లపై దరఖాస్తులు అందినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత విభాగాలకు ఫిర్యాదులను రిఫర్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇను స్పెక్టర్ ఉమేష్ కుమార్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

