కారుకు టాటా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కారుకు టాటా..!
– హస్తం గూటికి మున్సిపల్ చైర్ పర్సన్
– కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా
– హీట్ పెంచిన కాంగ్రెస్ పాలిటిక్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు బీఆర్ఎస్ నేతలు కారుకు టాటా చెప్పేందుకు సిద్దమయ్యారు. పార్టీని వీడి హస్తం గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునతారెడ్డి, వారి కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దం కావడంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.

ఈ నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి వర్గీయులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. నేడు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితారెడ్డి గాంధీ భవన్‌లో హస్తం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో ఆమెతో పాటు తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిసింది. చైర్ పర్సన్‌తో పాటు కౌన్సిలర్ రాము, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ పట్టణ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ రవీందర్, ఎమ్మెల్సీ వర్గంకు చెందిన నాయకులు గడ్డలి రవీందర్, బీఆర్ఎస్ వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు తదితరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. తాండూరు పట్టణ నేతలే కాకుండా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుబోతున్నారు. కారు టాటా చెప్పే నేతల సంగతేలా ఉన్నా.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హస్తం గూటికి ఎప్పుడు చేరుతారనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!