కొలువైన కొత్త కార్యవర్గం

తాండూరు రాజకీయం వికారాబాద్

కొలువైన కొత్త కార్యవర్గం
– కమల్‌ అతహర్‌కు అభినందనల వెల్లువ
– కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్‌లో కొత్త కార్యవర్గం కొలువైంది. అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కమల్‌ అతహర్‌ బాధ్యతలు స్వీకరించారు. ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలో అధ్యక్షులుగా కమల్‌ అతహర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కోశాధికారి యూనుస్ కూడ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. కార్యదర్శి స్థానానికి ఖాలేద్ సఫీఉల్లా ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. బుధవారం నూతనంగా ఎన్నికైన కొత్త కార్యవర్గం అసోసియేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అసోసియేషన్ అధ్యక్షులు బాబర్‌ నుంచి కమల్‌ అతహర్ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు నూతన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు శాలువా పూల మాలతో సన్మానించారు. అనంతరం కమల్‌ అతహర్‌తో పాటు కొత్త కార్యవర్గాన్ని అభినందనలు తెలిపారు.

డీఎస్పీని కలిసిన సభ్యులు
అంతకుముందు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గంతో కలిసి తాండూరు డీఎస్పీ జీ.శేఖర్‌ గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు తమ అసోసియేషన్ కార్యాచరణ, విధి విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు, సీనీయర్ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.