తాండూరులో మరో నామినేషన్ తిరస్కరణ
– ముగ్గురుకు చేరిన అభ్యర్థుల సంఖ్య
– ప్రకటించిన ఎన్నికల అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు అసెంబ్లి ఎన్నికలకు సంబంధించి మరో నామినేషన్ తిర్కస్కరణకు గురైనట్లు ఎన్నికల అధికారులు ఆలస్యంగా వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు ఇద్దరు నామినేషన్లను తిరస్కరించినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో బీఆర్ఎస్ తరుపున ప్రమోదిని రెడ్డి నామినేషన్‌ను బీఫారం, అఫిడవిట్, ప్రపోజల్ కు సంబంధించి పత్రాలు ఇవ్వలేదని, బీజేపీకి చెందిన యు.రమేస్ కూడా ఏ, బీ ఫారాలతో పాటు ప్రపోజల్ వివరాలను అందించని కారణంగా రిజక్ట్ చేసినట్లు వెల్లడించారు.
తాజాగా ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అభ్యర్థికి 25 ఏండ్లు ఉండాలని నిబంధన ఉందని అధికారులు తెలిపారు. అయితే డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ(డీఆర్పీ) నుంచి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి అజయ్ రెడ్డికి 22 ఏండ్లు మాత్రమే ఉండడంతో దానిని కూడా రిజక్ట్ చేసినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. దీంతో నామినేషన్ రిజక్ట్ చేసిన సంఖ్య ముగ్గురికి చేరిందని వివరించారు.
ఇదికూడా చదవండి…

