నారా మహిపాల్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ
– కుటుంబ సబ్యులను పరామర్శించిన మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, స్వర్గీయ నారా మహిపాల్ రెడ్డి ఇంటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వెళ్లారు. కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఇటీవలే నారా మహిపాల్ రెడ్డి గుండెపోటుకు గురై కన్నుమూసిన విషంయ తెలిసిందే. శుక్రవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాత తాండూరులోని నారా మహిపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించి అందరు మనోధైర్యంతో ఉండాలని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందించారు. ఎమ్మెల్సీ వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు బల్వంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి, బిర్కడ్ రఘు, భగవాన్, ఇర్ఫాన్, అజాల్, నిసార్ ఖాన్ తదితరులు ఉన్నారు.

