పెరుగుతో ఆరోగ్యం మెరుగు

ఆరోగ్యం జాతీయం తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

పెరుగుతో ఆరోగ్యం మెరుగు
– వేసవిలో ప్రతిరోజూ తీసుకోండి
– ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి
దర్శిని డెస్క్‌: వేసవికాలంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే శరీరం వేసవి తాపానికి గురికాకుండా ఉంటుంది. ఆహార నియమాల్లో పెరుగు, మజ్జిగకు ప్రత్యేక స్థానం కల్పిస్తే ఇక మంచి ఆరోగ్యం మీ సొంతం. పెరుగులో ఆరోగ్యకరమైన పోషకాలు దాగి ఉన్నాయి. రోజూ పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వేసవిలో కూడా ప్రతిరోజూ పెరుగు తింటే శరీరానికి ఔషధ గుణాలు లభిస్తాయి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో ఉండే ఫాస్ఫరస్, క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. దీంతో పాటు పెరుగులో జింక్, విటమిన్-ఇ ఉండటం వల్ల చర్మం మెరుస్తుంది. రోజూ పెరుగు తినడం వల్ల చర్మం అందంగా కనిపిస్తుంది. మీ జీర్ణక్రియను మెరుగుపరిచే అనేక గుణాలు పెరుగులో ఉన్నాయి. అందేకే పెరుగు తినే వారికి కడుపు సంబంధిత సమస్యలు దరిచేరవు. స్థూలకాయంతో బాధపడేవారు పెరుగు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ పెరుగు తినడం వల్ల బరువు తగ్గవచ్చు.

మరిన్ని ప్రయోజనాలు
పెరుగుతో రకరకాల పళ్లను కలిపి తీసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఇన్ ఫెక్షన్లను నివారిస్తుంది.
పెరుగులో ఉన్న బ్యాక్టీరియా హానికరమైన బ్యాక్టీరియా కాదు. మంచి బ్యాక్టీరియా. ఇది శరీరంలో ఉన్న అనేక రుగ్మతలను నివారిస్తుంది.
పెరుగు శరీరంలో వృధ్దాప్య ఛాయలను కనిపించనివ్వదు.
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు రోజుకు కనీసం రెండు కప్పుల పెరుగు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
పెరుగులో చక్కెర కలుపుకుని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. పెరుగు మంచి ఎనర్జీ బూస్టర్.
నీళ్ల విరోచనాలతో బాధపడుతున్న వారు పెరుగులో కొద్దిగా మెంతులు వేసుకుని తీసుకుంటే చాలా మంచిది.
డైట్ లో ఉన్నవారు పెరుగులో అటుకులు, ఓట్స్, మరమరాలతో కలిపి తీసుకుంటే శరీరానికి చలువ చేయడమే కాకుండా తొందరగా ఆకలి వేయదు.
పెరుగులో ఉన్న విటమిన్ కె కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది.
పెరుగులో వాము కలుపుకుని తింటే దంతక్షయం, దంతాలకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.
అధిక వొత్తిడితో బాధపడుతున్న వారు పెరుగు తింటే ఆ వత్తిడికి దూరం అవుతారు.
శరీరంలో హర్మోన్ల అసమతుల్యతలను పెరుగు అదుపు చేస్తుంది.
పెరుగులో ఫ్యాట్ అతి తక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగు ఎంత తిన్నా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు.
కొద్దిగా నల్ల ఉప్పు పొడిని పెరుగులో కలుపుకుని తింటే అజీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నవారు పెరుగులో పసుపు, అల్లం కలుపుకుని తినాలి.
విటమిన్ సి లోపంతో బాధపడుతున్నవారు పెరుగులో నిమ్మకాయ, లేక బత్తాయి, కమలాపండు జ్యూస్ తో తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఎసిడిటి, గ్యాస్ సమస్యలకు పెరుగు, తేనే కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రోజు పెరుగు తినే వారికి క్యాన్సర్, ఇన్ టెస్టైన్ కు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజు పెరుగు తినే వారి చర్మం మంచి కాంతివంతగాను, ఆరోగ్యంగాను ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పాలకంటే కూడా పెరుగు అతి త్వరగా జీర్ణం అవుతుందని నిపుణుల అభిప్రాయం. పెరుగు గంటకు 90 శాతం జీర్ణం అయితే, పాలు 30 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని వారు అంటున్నారు.