భద్రేశ్వర జాతర ఉత్సవాలకు జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వర జాతర ఉత్సవాలకు జై..!
– రథచక్రాల పూజలతో అంకురార్పణ
– పూజలు చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఆలయంలో జనరంజకంగా పంచాంగ శ్రవణం
– పాల్గొన్న తాండూరు ప్రజా ప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో అత్యంత వైభవంగా జరిగే శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు జైకొట్టారు. ప్రతి యేడాది ఉగాది పర్వదినాన ప్రారంభించే భద్రేశ్వర స్వామి రథచక్రాలకు పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ జరగడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం భద్రేశ్వరుడి రథచక్రాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను లాంచనంగా ప్రారంభించారు.

ఆలయ చైర్మన్ బంటారం సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు, సంఘాల సభ్యులతో కలిసి హాజరయ్యారు. కూడలిలో ఏర్పాటు చేసిన చక్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో భద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జనరంజకంగా పంచాంగ శ్రవణం
అనంతరం ఆలయ ఆవరణలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం వినించారు. ఈ యేడాది సమాజంతో పాటు రాజకీయ, విద్యా, వైద్య, వ్యవసాయ తదితర రంగాలలో సాధించే మంచి చెడుల గురించి పంచాంగంలో వినిపించారు. ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం జనరంజకంగా సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, నరేందర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, ఆలయ ఈఓ శేఖర్ గౌడ్, కౌన్సిలర్ బంటారం లావణ్య, వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, సభ్యులు గాజుల శాంతుకుమార్, బంటారం భద్రేశ్వర్, నీలకంఠ స్వామి, విజయ్ కుమార్ స్వామి, సమాజం సభ్యులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.