చేపల వేటుకు వెళ్లిన ఇద్దరు మృతి

క్రైం తాండూరు వికారాబాద్

చేపల వేటుకు వెళ్లిన ఇద్దరు మృతి
– ఖాంజాపూర్ కాగ్నావాగులో ఘటన
– పరీశీలించిన పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన తాండూరు మండలం ఖాజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన దేవరి మల్లేష్ (28), నర్సింలు(17)లు శనివారం మధ్యాహ్నం ఖాంజాపూర్ గ్రామంలోని కాగ్నానదికి చేపలు పట్టేందుకు వెళ్లారు.

చేపలు పట్టే క్రమంలో వాగులోని వలలో చిక్కిప్రమాద వశాత్తు మునిగిపోయారు. అటుగా వెళ్లిన గ్రామస్తులు వాగులో బట్టలు, చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి వద్దకు వెళ్లి చూశారు. ఈ విషయం సాయిపూర్ లో కూడ పుకారు రావడంతో ఆందోళన చెందారు. ఇంటి నుంచి వెళ్లిన మల్లేష్‌, నర్సింలు తిరిగి రాకపోవడంతో కుటుంభీకులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతి చెందిన మల్లేష్, నర్సింలులు తమవారే అని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సాయిపూర్ కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి భర్త బీఆర్ఎస్ నాయకులు బాల్ రెడ్డి వెంటనే తాండూరు రూరల్ సీఐ రాంబాబుకు సమాచారం అందించారు. దీంతో సీఐ రాంబాబు పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డితో కలిసి వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్థం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.