ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ జయంతి
– భారీగా తరలివచ్చి జయప్రదం చేయండి
– దళిత ప్రజాసంఘాల పిలుపునిచ్చారు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్. అంబేద్కర్ 132వ జయంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తాండూరు దళిత సంఘాల ప్రతినిధులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని జైభీమ్, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 14న తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు నియోజకవర్గంలో ఉన్న దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో నాలుగు మండలాల మేధావులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల కార్మిక సంఘాల విద్యార్థి సంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మెట్లీ ఆశన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, తాండూరు పట్టణ జై భీమ్ అధ్యక్షులు నరసింహ ఎన్టీఆర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తాండూరు పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్, తాండూరు డివిజన్ సీఐటీయూ నాయకులు బి చంద్రప్ప, తాండూరు పట్టణ ఎస్సీ సెల్ కార్యదర్శి అనంతి, 15 వార్డు ఇన్చార్జి జుంటుపల్లి ఉదయ్ భాస్కర్, జుంటుపల్లి వెంకట్, ఎమ్మార్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు బాల్ రామ్, తాండూరు పట్టణ యూత్ అధ్యక్షులు డేవిడ్ సన్నీ, అనిల్, శ్రావణ్, సాయి తేజ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

