ఆనందం పంచిన మార్వాడి యువ మంచ్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఆనందం పంచిన మార్వాడి యువ మంచ్
– వీవీహెచ్ఎస్ స్కూల్లో ఆనంద్ సబ్ కే లీయే
– విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మార్వాడి యువ మంచ్ సభ్యులు విద్యార్థులకు ఆనందాన్ని పంచారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో గత 8 ఏండ్లుగా నిర్వహిస్తున్న ఆనంద్ సబ్ కే లియే కార్యక్రమాన్ని బుధవారం తాండూరు పట్టణంలో’ ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని విజయ విద్యాలయ స్కూళ్లో విద్యార్థులకు స్వీటు బాక్సులు, కుల్ఫీలు, చాక్లెట్లు, బిస్కెట్లు పంచారు. పండగను దృష్టిలో ఉంచుకుని టపాసులు కూడా పంచి వారిచేత కాల్పించారు. చిన్నారుల్లో సంతోషాన్ని పంచి.. ఆనందాన్ని నింపారు. ఈసందర్భంగా మార్వాడి యువమంచ్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల్లో సంతోషాన్ని పంచడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు.

సభ్యులు భరత్ దేవ్డా, ఆశారాం లక్ష్మీ నివాస్ సార్డా, చారిట్రబుల్ ట్రస్ట్, రమేష్ చంద్ర బూబ్, సంపత్ కుమార్ సార్డా, వినోద్ జైన్ సహాకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా వచ్చే ఫిబ్రవరిలో స్కూల్ నుంచి 200ల మందిని విహార యాత్రకు తీసుకెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, జాతీయ కార్యవర్గ సభ్యులు కుంజ్ బిహారి సోని, హెచ్ఎం శరత్కళ, జాయింట్ సెక్రటరి శెట్టి భాస్కర్. మంచ్ కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, రాంనారాయణ బూబ్, మహేష్ సార్డా, పవన్ సోని, సంజయ్ సోని, అనిల్ సార్డా, దినేష్ పర్తాని, మహేష్ సార్డా, లక్ష్మీనారాయణ బూబ్, అశిష్ సార్డా, క్రిష్ణ బూబ్, దీపక్ బూబ్, నిఖిల్ గగ్రాని. శ్రీగోపాల్ రాఠి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..