సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం
– సీఎం కేసీఆర్ పాలనలో అందరికి సంక్షేమ పథకాలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరులో బీసీ బందు లబ్దిదారులకు చెక్కులు అందజేత
– మహిళలకు బతుకమ్మ చీరలు, పంచాయతీలకు స్పోర్ట్ కిట్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో తాండూరు పట్టణంతో పాటు పెద్దేముల్, కోట్ పల్లి మండలాలకు చెందిన లబ్దిదారులకు బీసీ బందు కింద చెక్కులను అందజేశారు. పలు గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ప్లేకిట్స్, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్. పాలనలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సర్కారు పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అసరా, కళ్యాణలక్ష్మీ, దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, మైనార్టీలకు సాయం వంటి పథకాలతో అర్హులైన పేదలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. అదేవిధంగా గ్రామా పంచాయతీలకు క్రీడా కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు.

ప్రతి యేడాది మాదిరిగానే మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను నమ్మొద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీఐ శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయదేవి, మంకాల రాఘవేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

