– మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
దర్శిని ప్రతినిధి, తాండూరు : 57 ఏండ్లు నిండిన వారు ఆసరా వృద్ధాప్య ఫించన్‌కు దరఖాస్తు చేసుకోవాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 69 సంవత్సరాల నుండి 57 కు తగ్గించిందని తెలిపారు.
ఈ నెల 31లోపు అర్హులైన వారు అందరు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే సందర్భంలో మీసేవ/ఈసేవ కేంద్రాలలో ఎవరు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు కావలసిన ధ్రువపత్రాల ఆధారాలను సమర్పించలన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన వారందరికీ ఆసరా పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని పేర్కొన్నారు.