సీతారాముల కళ్యాణ వైభోగం..!
– తాండూరులో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
– ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– సీతారాములను దర్శించుకున్న చీఫ్ మహేందర్ రెడ్డి
– సాయిపూర్‌లో కళ్యాణంలో పాల్గొన్న చైర్ పర్సన్ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతమంతా రామనామ స్మరణలో తరించింది. నియోజకవర్గంతో పాటు తాండూరు పట్టణమంతా రామమయంగా మారింది.

శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు వైభోగంగా జరిగాయి. పట్టణంలో ప్రసిద్ధి చెందిన స్టేషన్ హనుమాన్, ఇందిరానగర్ లోని రాంమందిర్, సీతారాంపేట్ హనుమాన్ దేవాలయం, సాయిపూర్ హనుమాన్ దేవాలయం, మల్‌రెడ్డి పల్లి ఆంజనేయ స్వామి దేవాలయం, పాత తాండూరు రామాలయం, శ్రీరామపురం(రసూల్‌పూర్) అభయ హనుమాన్ దేవాలయాలలో ఆయా దేవాలయాల చైర్మన్లు, ఆలయ కమిటి సభ్యులు, సంఘాలతో పాటు వివిధ కాలనీలలో సంఘాల ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవాలను ఉదయం నుంచి శుభలగ్న సుమూహూర్తములో వేద పండితుల మంత్రోచ్చరణల మద్య సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.

నీలమేఘశ్యాముడు జనకుని కూతురు సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేస్తుండగా తరలివచ్చిన ఆశేష భక్తజనవాహిని తన్మమయంతో పులకించి జయ జయ ద్వానాలు చేశారు. పట్టణంలోని సాయిపూర్‌లో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, పట్లోళ్ల బాల్ రెడ్డి, కౌన్సిలర్ బంటు వేణు దంపతులు సీతారాముల తరుపున పాల్గొని కళ్యాణం వైభోగంగా జరిపించారు.
పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు పట్టణంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో ఇందిరానగర్. సాయిపూర్, స్టేషన్ హానుమాన్, సీతారం పేట్ హనుమాన్ దేవాలయాలతో పాటు పలు ప్రాంతాలలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గోని సీతారాములను దర్శించుకున్నారు.

ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, బంటు మల్లప్ప, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయరవి, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, యువకులు తదితరులు ఉన్నారు.
దర్శించుకున్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
శ్రీరామ నవవి సందర్భంగా తాండూరు పట్టణంలో ఇందిరానగర్. సీసీఐ కాలనీ, స్టేషన్ హానుమాన్, సీతారం పేట్ హనుమాన్ దేవాలయాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆయా దేవాలయాలు, ప్రాంతాలలో సీతారాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇందిరానగర్ రామ మందిరానికి రూ. 1లక్ష 11వేల 111లు విరాళం ప్రకటించారు. ఆయన వెంట సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, యువనాయకులు బిడ్కర్ రఘు, నేతలు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.


