ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం.!
– అభిప్రాయాలను తెలపాలన్న హైకోర్టు
– ఫిటిషన్ దాఖలపై నిర్ణయం
దర్శిని డెస్క్: ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అధికారికంగా జరిగే పనులకు ఆధార్ తప్పనిసరి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులతో ఆధార్ అనుసంధానం జరుగుతోంది. తాజాగా ఆస్తులను కూడ అనుసంధానం చేయాలనే అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. దీని ద్వారా అక్రమార్కుల బీనామీ ఆస్తులు బహిర్గతం అవుతాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఆస్తులకు కూడా ఆధార్ లింక్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అశ్వినీ ఉపధ్యాయ్ అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కూడా మంచి నిర్ణయమని అభిప్రాయ పడింది. దేశ పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలనే దాఖలైన పిటిషన్‌పై సోమవారం కేంద్రం నుంచి సమాధానం కోరింది కోర్టు.
ఈ పిటీషన్‌పై కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మతో పాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ మనీశ్ మోహన్‌లు కూడా ఇది ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం.. ఈ అంశంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ-పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించింది. అయితే అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులను అరికట్టేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణ జూలై 18వ తేదీకి వాయిదా వేసింది.

