మంత్రి హరీష్ రావు రాక కోసం పకడ్బందీ ఏర్పాట్లు

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

మంత్రి హరీష్ రావు రాక కోసం పకడ్బందీ ఏర్పాట్లు
– ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– రేపు నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన
– రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రేపు తాండూరులో పర్యటించనున్నారు. రూ. 50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకోసం తాండూరు నేతలు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్వయంగా మంత్రి హరీష్ రావు పాల్గొంటున్న శంకుస్థాపన, ప్రారంభోత్సవ పనులతో పాటు బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించారు. ముందుగా రూ.25 కోట్లతో నిర్మిస్తున్న తాండూరు నర్సింగ్ కళాశాల శంకుస్థాపన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం మాతా శిశు ఆసుపత్రిలో ప్రారంభించే షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. అక్కడి నుంచి తాండూరులోని ట్రాఫిక్ పోలీస్టేషన్, గ్రంథాలయ భవన నిర్మాణ పనుల ప్రారంభోత్సవం గురించి సమీక్షించారు. అదేవిధంగా మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, సమాచార, గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు హాజరవుతున్న బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు.

పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గురుండి పరిశీలించారు. మంత్రుల పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులతో పార్టీ నేతలను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు, తహసీల్దార్ తారాసింగ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అపూ(నయం), పార్టీ నాయకులు శ్రీనివాస్ చారి, పట్లోళ్ల నర్సింలు, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాంబాబు, ఆయా శాఖల అధికారులు, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు