విఘ్నాలు బాపరా విఘ్నేశ్వరా..!
– బొజ్జ గణపయ్యను పూజించిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
– కరోనా అంతమ్మవ్వాలని వినాయకుడికి విన్నపాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: విఘ్నాలు బాపరా విఘ్నేశ్వరా అంటూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వినాయకున్ని వేడుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలో ప్రతిష్టించిన వినాయకులను శనివారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి దర్శించుకున్నారు. పట్టణంలోని గంజ్, చీరల బజార్, భద్రప్ప గుడి, గాంధీ చౌక్, వినాయక్ చౌక్, పాత తాండూరు తదితర చోట్ల ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజించినవారికి అంతా మంచే జరుగుతుందని అన్నారు. విఘ్నాలను తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు అని.. ఆ వినాయకుని కృపతో కరోన మహమ్మారి త్వరగా అంతమ్మవలని కోరుకుందాం అని అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కొరుకునట్టు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ వెంకట్ రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్, నర్సింలు, రాజు గౌడ్, శ్రీనివాస్ చారి, నయీం అఫ్ఫు, హరిహర గౌడ్, నర్శిరెడ్డి, గోపాల్ అడ్వకేట్, కో ఆప్షన్ సభ్యుడు వెంకట్ రామ్ నాయక్, సంతోష్ గౌడ్, రాజన్ గౌడ్, ఇర్శాధ్, యోగానంద, ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.
