రేవంత్ రెడ్డి ఖబడ్డార్.!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

రేవంత్ రెడ్డి ఖబడ్డార్.!
– టీపీసీసీ అధ్యక్షునికి తాండూరు టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక
– మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలపై జోలికొస్తే ఊరుకునేది లేదు
– మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ విదల్ నాయక్, నేతలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఖబడ్డార్ అంటూ తాండూరు టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. సోమవారం తాండూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ విఠల్ నాయక్ అధ్యక్షతన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల నర్సింలు, నాయకులు రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాసాచారీ, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని పరిగిలో చేపట్టిన మన ఊరు మన పోరు బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి సబితారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలపై చేసిన వాఖ్యలను ఖండించారు. పాలమూరు రంగా రెడ్డికి ప్రభుత్వం నిధుల‌ను విడుదల చేసి ప‌నులు కొన‌సాగిస్తుంటే దీనిపై కోనికి చెందిన నేతతో కోర్టులో కేసు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి సబితా రెడ్డిపై వాఖ్యలు చేయడం నీచమన్నారు. చేనేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్ల వ్యాపారంలో ఎందరితో ఉపాధి కల్పిస్తున్నది. అదేవిధంగా కరోనా సమయంలో పాఠశాలల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అలాంటి ప్రజా నేతపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. పరిగి, తాండూరు నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి ఏజెంట్గా పనిచే కారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై టీఆర్ఎస్ నాయకులపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ నోటి దురుసుతో రాద్ధాంతాలకు తెరలేపుతున్నారని అన్నారు. మరోసారి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలపై నోరుజారితే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి భేషరుతుగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చె శారు. పద్ధతి మార్చుకోకుంటే ఊరుకునేది లేదని, జిల్లాలో ఎక్కడైనా సభలు పెడితే అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జీ ఇంతియాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భీంరెడ్డి తదితరులు ఉన్నారు.