తాండూరు మున్సిపల్ ఓటర్ల లెక్క ఇదే..!
– 77,110 మందితో ముసాయిదా జాబితా విడుదల
– మహిళలు, పురుషుల వివరాలతో ప్రదర్శన
– కార్యాలయంలో ఎన్నికల కోలాహలం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని ఓటర్ల లెక్కను అధికారులు ప్రకటించారు. శుక్రవారం కార్యాలయంలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు.

తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు సంబంధించిన ఓటర్ల వివరాలను వార్డుల వారిగా ప్రదర్శించారు. పట్టణంలోని 36వార్డులకు సంబంధించి 77 వేల 110 ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో 35వేల 547 మంది పురుషులు, 39వేల 558 మహిళలు, ఇతరులు 5 మంది ఉన్నట్లు ప్రకటించారు. ఈ ముసాయిదా జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.

ఓటర్ల ముసాయిదా జాబితాపై ఈనెల 5న రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 9వ తేది వరకు అభ్యంతరాలు స్వీకరించి.. 10వ తేదిన తుది జాబితాను ప్రకటించనున్నారు.
ఎన్నికల కోలాహలం
మున్సిపల్ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రదర్శనతో కార్యాలయంలో కొలాహలం ఏర్పడింది. పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్లు, పలువురు నాయకులు కార్యాలయంలో సందడి చేశారు. ప్రదర్శనకు ఉంచిన ఓటరు జాబితా వివరాలను పరిశీలించారు. కొత్తగా ఏమైనా మార్పులు జరిగాయా.. ఓటర్లు పెరిగారా లేదా అనే అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ముసాయిదా జాబితాలో ఏమైనా తప్పులు ఉన్నా.. అనుమానాలు ఉన్నా.. అభ్యంతరాలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదికూడా చదవండి…

