బీఆర్ఎస్ తాండూరు ప్లీనరీకి ముహుర్తం ఖరారు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ తాండూరు ప్లీనరీకి ముహుర్తం ఖరారు
– జయప్రదానికి పిలుపునిచ్చిన ఎమ్మల్యే రోహిత్ రెడ్డి
– ఒక్కొ మండలానికి 400ల మంది చొప్పున తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌ గా మారిన తొలిసారి నిర్వహించే గులాబీ పార్టీ తాండూరు నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేశారు నేతలు. ఇప్పటికే పార్టీ ప్లీనరీ సమావేశం స్థలం, రోజు, సమయం ఖరాయ్యింది. ఈనెల 25న యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో ప్లీనరీ నిర్వహించేందుకు నిర్ణయించారు. అదే రోజు ఉదయం 8గంటలకు అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు, నేతలకు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం ఉదయం 10 గంటలకు యాలాల మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో జరుపుకునే ప్లీనరీ సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతో పాటు వివిధ మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ప్లీనరీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ చైర్మన్లు మరియు డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతుబంధు కన్వినర్లు, సభ్యులు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మండలాల అనుబంధ కమిటీ నాయకులు (యువజన,మహిళా, బిసి, ఎస్సి, ఎస్టీ రైతు)అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, మున్సిపాలిటీల పరిధిలోని పార్టీ చైర్మన్లు, కౌన్సిలర్లు, టౌన్ పార్టీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు సభ్యులు, వార్డ్ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, అన్ని గ్రామాల పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, గ్రామ రైతు బంధు కమిటీ కోఆర్డినేటర్లు, అన్ని విభాగాలతో పాటు కుటుంబ సమేతంగా ఒక్కో మండలానికి 400ల మంది చొప్పున తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంపై అందరి దృష్టి పడింది.