కొండా ఓడినట్లే…!

తాండూరు రాజకీయం వికారాబాద్

కొండా ఓడినట్లే…!
– అన్నీ సర్వేలలో హస్తమే ముందు
– ప్రమాణం చేస్తున్న అందరికి అండగా ఉంటా
– చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమిని అంగీకరించినట్లే అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం విలియమూన్ గ్రౌండ్‌లో జరిగిన జన జాతర సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. పార్లెమెంట్ ఎన్నికల్లో నిర్వహించిన అన్నీ సర్వేలలో హస్తమే ముందుందన్నారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమిని అంగీకరించినట్లే అని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో చేతిని బలపర్చుకోవాలని, అందరు అండగా ఉండాలన్నారు. ఎంపీగా గెలిపిస్తే ప్రమాణం చేస్తున్నా ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం కృషి చేస్తానని అన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా అయోధ్యలో రామ మందిరానికి ఎలాంటి విరాళం ఇవ్వలేదని, తాను రూ. 10లక్షలు ఇచ్చానని గుర్తుచేశారు. రానున్న 24 గంటలు పార్టీ గెలుపుకోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, స్పీకర్ గడ్డం ప్రసాద్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సం’పన్ను’లకే బీజేపీ కొమ్ము..!