తాండూరు పోలీస్ సూపర్ స్మార్ట్..!

క్రైం టెక్నాలజీ తాండూరు వికారాబాద్

తాండూరు పోలీస్ సూపర్ స్మార్ట్..!
– కొట్టేసిన ఫోన్‌ను ట్రేస్‌ చేసి రికవరీ
– సీఈఐఆర్‌ ద్వార్‌ ఫోయిన ఫోన్‌ గుర్తింపు
– రెండు నెలల తరువాత అప్పగింత
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు పట్టణ పోలీసులు సూపర్ స్మార్ట్ అనిపించుకున్నారు. బాధితుడు పోగొట్టుకున్న ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన సాంకేతిక వ్యవస్థ సీఈఐఆర్‌ ద్వారా ట్రేస్‌ చేసి గుర్తించారు. రెండు నెలల క్రితం పోయిన ఫోన్‌ను గుర్తించి తిరిగి అప్పగించారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న లక్ష్మీగారి ఆంజనేయులు ముదిరాజ్ గత ఫిబ్రవరిలో తాండూరుకు వచ్చారు. 9వ తేదిన ఆయన ఫోన్ (వీవో వై – 75, 5జీ)ను గుర్తుతెలియని వ్యక్తులు కొట్టేశారు. దీంతో అదే రోజు ఆయన తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈనెల 16న తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన సీఈఐఆర్ లో బాధితుడు ఇచ్చిన వివరాలను నమోదు చేశారు. నమోదు చేసిన రోజే బాధితుడి నుంచి కొట్టేసిన ఫోన్ ఆచూకీని కనిపెట్టారు. పోయిన ఫోన్‌ను రికవరీ చేశారు. అదే రోజు ఈ విషయాన్ని ఆంజనేయులకు తెలిపారు.

అయితే అతనను వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్‌లో ఉండి రాలేకపోవడంతో మంగళవారం పోలీస్టేషన్‌కు వచ్చారు. దీంతో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సమక్షంలో పోయిన ఫోన్ ను ఆంజనేయులకు అప్పగించారు. ఫోన్‌ అప్పగించినందుకు ఆంజనేయులు తాండూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇకపై వినియోగ దారులు ఫోన్ పోగొట్టుకున్నా.. ఎవరైనా కొట్టేసినా సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసి ఇస్తామన్నారు. బాధితులు ఆధార్ కార్డు, ఐఎంఈఐ నెంబర్లతో మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సంఘటనతో పట్టణ ప్రజల నుంచి పోలీసులు స్మార్ట్ అంటూ ప్రశంసలు అందుకున్నారు.