ఆధైర్యప‌డ‌కు ఆదుకుంటాం

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

– ఇల్లు ద‌గ్ద‌మైన బాధితుడితో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, ఆగ‌స్టు 15 (ద‌ర్శిని) : షాక్ స‌ర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయిన బాధితుడికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ధైర్యం చెప్పారు. తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి ఇందిరాన‌గ‌ర్‌లోని 25వ వార్డుకు చెందిన మ‌హ‌మ్మ‌ద్ గౌస్ ఇంట్లో శ‌నివారం సాయంత్రం షాక్ స‌ర్య్యూట్ వ‌ల్ల అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది.


ఈ ప్ర‌మాదంలో రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆస్తిన‌ష్టం జ‌రిగింది. ఆదివారం ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాధితుడి నివాసానికి చేరుకున్నారు. బాధితుడు గౌస్‌తో మాట్లాడి ప్ర‌మాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధైర్య ప‌డ‌కు ప్ర‌భుత్వం నుంచి స‌హాయం అందేలా చూస్తామ‌ని బాధితుడికి భ‌రోసా ఇచ్చారు. ఆస్తిన‌ష్టంపై అంచనా వేసి ప‌రిహారం అందించే విధంగా చూడాల‌ని రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయ‌కులు శ్రీ‌నివాస్ చారి, న‌ర్సిరెడ్డి, మాజీ కౌన్సిల‌ర్ ఇర్ఫాన్, యువ‌నాయ‌కులు సంతోష్ గౌడ్, ఇంతియాజ్ త‌దిత‌రులు ఉన్నారు.