ఘనంగా కార్మిక దినోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా కార్మిక దినోత్సవం
– ఎర్ర జెండాలను ఆవిష్కరించిన కార్మిక సంఘాల నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలంలో మే డే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సోమవారం కార్మిక సంఘాలు ఏఐటీయూపీ, సీఐటీయుల ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ కార్యాలయంతో పాటు తాండూరు మండలంలోని పెన్నా సిమెంట్ కర్మాగారంలో జిల్లా నాయకులు విజయలక్ష్మీ పండిత్ రెడ్డిలు ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. మరో వైపు సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి టీజేఎస్ ఇంచార్జ్, కౌన్సిలర్ సోమశేఖర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికుల పక్షాన సంఘాలు నిరతరం పోరాటం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా యూనియన్ల కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.