గులాబీమయం కావాలి
– ప్లీనరీని పండగలా జరుపుకుందాం
– టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మొత్తం గులాబీమయం అయ్యేలా జెండాలను ఆవిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్లీనరీని పండగలా జరుపుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల ఆదేశాల మేరకు తాండూరులోని ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, వార్డు కమిటిల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ అనుభంధ సంఘాల ప్రతినిధులు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించాలన్నారు. పార్టీ సీనీయర్ నాయకులు, నాయకులతో కలిసి ప్లీనరీని విజయవంతం చేయాలని సూచించారు.

