నైపుణ్యాల మెరుగుకు దోహదం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

నైపుణ్యాల మెరుగుకు దోహదం
– కేవీసీఎస్‌లో ఉత్సహాంగా సమ్మర్ క్యాంపు
– ప్రారంభించిన ప్రిన్సిపల్ ప్రశాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వేసవి సెలవుల్లో కూడ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు సమ్మర్‌ క్యాంపులు దోహదపడతాయని తాండూరు కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్(కేవీసీఎస్) ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్ అన్నారు. బుధవారం కేవీసీఎస్‌లో ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంపు ఉత్సహాంగా ప్రారంభమయ్యింది. ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్ ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గణితం, ఎల్గా, క్యాలిగ్రఫీ ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, పేయింటింగ్, కోడింగ్, స్కేట్స్‌, బ్యాడ్మింటన్ వంటి విభాగాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వేసవి సెలవులు వృధా కాకుండా ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంపుతో విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు దోహదపడతాయన్నారు. దీంతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక ఉత్సహాం, ఉత్తేజం లభిస్తాయన్నారు. అనుభవజ్ఞులు అయిన టీచర్లతో ఇచ్చే శిక్షణ సమ్మర్‌ క్యాంపును విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.