అంబరాన్నంటిన రైతుబంధు సంబరాలు
– పురవీధుల్లో ఆకట్టుకున్న ఎడ్లబండి, ట్రాక్టర్ల ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులను ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు సీఎం కె సీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకంపై తాండూరులో సంబరాలు జరుపుకున్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో నెహ్రు గంజ్లో ఈ సంబరాలను జరుపుకున్నారు.
కొత్తగా నిర్మిస్తున్న షెడ్డులో రైతుబంధు సంబరాలను పురస్కరించుకుని అందమైన రంగవళ్లులతో అలంకరించారు. సంబరాలలో భాగంగా ఎడ్లబండ్లను, ట్రాక్టర్లను అందంగా అలంకరించారు. మహిళలు బతుకమ్మ పాటలకు ఆటలాడుతూ హోరెత్తించారు. కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కార్యదర్శి రాజకుమారి, ఎంపీటీసీ సాయిరెడ్డి, మహిళ నాయకురాలు శకుంతల, తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మల్లప్ప, గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు పటేల్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధుకు, సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నెహ్రు గంజ్ నుంచి పురవీధుల్లో ఎడ్లబండిలతో పాటు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముందు రైతులు, హమాలి కార్మికులు జొన్న, కుసుమ తదితర పంటల మొక్కలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. పురవీధుల్లో కొనసాగిన ఈ ర్యాలీ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ శాఖ అధికారిణి రజిత, హమాలి కార్మిక సంఘం నాయకులు, కార్మికులు, వ్యాపారులు, మార్కెట్ కమిటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


