ఫుడ్‌ ఫెస్టివల్‌ సూపర్‌..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఫుడ్‌ ఫెస్టివల్‌ సూపర్‌..!
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహత్ రెడ్డి కితాబు
– ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల ప్రదర్శనకు ప్రశంసలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సూపర్‌ అంటూ కితాబిచ్చారు. బుధవారం తాండూరు డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకుల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. 15 స్టాల్స్ లో 41 రకాల భోజనం, తినుబండారాలు, పానీయాలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విద్యార్థులు ప్రదర్శించిన ఫుడ్ ఫెస్టివల్ ను మనసారా అస్వాదించారు. తినుబండరాలను, పానియాలను తీసుకుని రుచి చూశారు. అహా అనిపించేలా ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. సూపర్ అంటూ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా త్వరలోనే రూ.1.50 కోట్లతో కాలేజీలో అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు స్కాలర్ షిఫ్ లు కూడ అందిస్తామన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో మంచి ఫలితాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, ప్రిన్సిపల్ డా.ఎం. రవీందర్, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహకులు డా.ఆఫ్రీన్, షరీఫా, అద్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!
– ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు
– కేరళలో చోటు చేసుకున్న దారుణం
– సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్
– తీవ్ర సంచలనమైన ఘటన
https://dharshininews.com/17082