ఫోన్లో వశీకరణం..!
– రూ.40వేలు స్వాహా
– సైబర్ క్రైంపై జర్నలిస్టు ఫిర్యాదు
దర్శిని డెస్క్: వశీకరణం(హిప్నటైజ్) విద్యను నిపుణులు మంచి ప్రయోజనాలకు వినియోగిస్తే.. మరికొందరు చెడు ప్రయోజనాలకు వినియోగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫోన్ ద్వారా హిప్నటైజ్ చేసి డబ్బులు స్వాహా చేశాడు. ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టుకే ఈ అనుభవం ఎదురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గత నెల 25న ఢిల్లీలో రమేశ్ కుమార్ రాజా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను హిప్నటైజ్కు గురై రూ.40 వేలు పోగొట్టుకున్నానంటూ తెలిపారు. ‘ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అతడికి నేను బాగా తెలిసినట్లుగా మాట్లాడాడు. తను నా పాత స్నేహితుడినని నమ్మించాడు. అతడి మాటలు విన్నాక నేను తర్కంతో ఆలోచించే శక్తిని కోల్పోయినట్లు అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నన్ను మాటల్లో ముంచి పేటీఎం ద్వారా నా బ్యాంక్ ఖాతా నుంచి రూ.20వేలు చొప్పున రెండు సార్లు డబ్బు కాజేశాడు’’ అని రాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫోన్లో హిప్నటైజ్ చేయడం సాధ్యం కాదని హిప్నాటిజంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు.
ఇది కూడా చదవండి…
హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..!
– వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు
– కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
https://dharshininews.com/17144

