భద్రతా భావం పెంచేందుకు దృష్టి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రతా భావం పెంచేందుకు దృష్టి
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– పట్టణ పురవీధుల్లో పోలీసుల కవాతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజల్లో భద్రతా భావంను పెంచేందుకు దృష్టిసారించడం జరుగుతుందని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, వికారాబాద్ ఫ్యూరిటీ ఫోర్స్, పట్టణ పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు.

పట్టణంలోని పాత తాండూరు నుంచి మార్వాడి బజార్, భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, ఇందిరా చౌక్, అంబేద్కర్ చౌక్ పుర వీధుల్లో ఈ కవాతు కొనసాగింది. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ సీఐ సంతోష్ కుమార్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కవాతుతో ప్రజల్లో భయాందోళన దూరం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఫ్యూరిటీ ఫోర్స్ పనిచేస్తాయన్నారు. ప్రజలు అందరు శాంతియుత వాతావరణంకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆర్ఎఫ్, ఫ్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆప్లై చేసిన 15రోజులకే..!