పట్టణంలో కూడ హెల్మెట్ ధరించాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టణంలో కూడ హెల్మెట్ ధరించాలి
– లేదంటే జరిమానాలు తప్పవు
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
– 30 మంది వాహనదారులకు జరిమాన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రమాదం ఎప్పుడు.. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడం సాధ్యం కాదు. అందుకే వాహనదారులు పట్టణంలో కూడా హెల్మెట్ ధరించాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం తాండూరు పట్టణం పెద్దేముల్ రోడ్డు మార్గంలో హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. సీఐ రాజేందర్ రెడ్డితో పాటు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తనిఖీలో పాల్గొని దాదాపు 70 బైకులను ఆపి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలను వివరించారు. 25 మంది వాహనదారులతో కొత్త హెల్మెట్‌లను కొనుగోలు చేయించారు.

అదేవిధంగా హెల్మెట్ ధరించని 30 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మరణాలలో ఎక్కువగా హెల్మెట్ ధరించని ప్రమాదాలే అధికంగా ఉన్నాయన్నారు. కావున దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, పట్టణంలో తిరిగే వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. పట్టణ వాహనదారులు పట్టణంలో కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపించాలన్నారు. హెల్మెట్ ధరించకుంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
పట్టణ రహదారులకు రాజయోగం
– తాండూరు రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు
– జీఓ 217ను జారీ చేసిన ఆర్అండ్‌బీ
– ఫలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి

పట్టణ రహదారులకు రాజయోగం