రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రాజీవ్ ఆశయ సాధనకు కృషి చేయాలి
– నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
– తాండూరులో 32వ వర్దంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డుమార్గంలోని రాజీవ్ కాలనీ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ప్రభాకర్ గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశం సాంకేతిక రంగంలో దూసుకుపోతుందంటే రాజీవ్ గాంధీ కృషే కారణమన్నారు. అట్టడుగు ప్రజల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకులు సర్దార్ ఖాన్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, వడ్డె శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
గేదేను కాటేసిన పిచ్చికుక్క..!
– దాని పాలను తాగి దూడ మృతి
– అవే పాలను అమ్మిన యజమాని
– తరువాత ఏం జరిగిందంటే..??
https://dharshininews.com/17279
chaithany collage