కంటి వెలుగు పేదలకు వరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

కంటి వెలుగు పేదలకు వరం
– మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి
– పాత తాండూరులో కంటి వెలుగు శిబిరం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధి పాత తాండూరులోని 15వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు-2 శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధత్వ నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని అన్నారు. కంటి సమస్యలు ఉన్న పేదలు కంటి వెలుగులో పరీక్షలు చేయించుకుని సమస్యలు తీర్చుకుంటున్నారని అన్నారు. ఇంకా కంటి సమస్యలు ఉన్న పేదలు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిబిరంలో పరీక్షలు చేయించుకుని ఉచితంగా కంటి అద్దాలు, మందులు తీసుకోవాలన్నారు. కంటి సమస్యలు తీరుస్తున్న కంటి వెలుగు పథకం పేదలకు వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు శిబిరం వైద్యులు, సూపర్ వైజర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
పైలెట్‌తోనే పట్టణాభివృద్ధి..!
– రూ.80లక్షలతో 25,6వ వార్డుల్లో అభివృద్ధి పనులు
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
https://dharshininews.com/17307
chaithany collage