శ్రీవారిని ద‌ర్శించుకున్న పెద్దేముల్ ఎంపీపీ అనురాథ ర‌మేష్

తాండూరు వికారాబాద్

శ్రీవారిని ద‌ర్శించుకున్న పెద్దేముల్ ఎంపీపీ అనురాథ ర‌మేష్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని పెద్దేముల్ ఎంపీపీ అనురాధ ర‌మేష్ ద‌ర్శించుకున్నారు. గురువారం తాండూరు మండ‌లం అంతారం అనుబంధ గ్రామం ద‌స్త‌గిరిపేట్‌లో శ్రీ దేవి భూదేవి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ఉత్త‌ర ద్వారా ద‌ర్శ‌నం క‌ల్పించగా.. ఈ సంద‌ర్బంగా పెద్దేముల్ ఎంపీపీ అనురాధ ర‌మేష్ దేవాల‌యానికి చేరుకున్నారు. ఆల‌యంలో ఏర్పాటు చేసిన ఉత్త‌ర ద్వారం ద్వారా ఆల‌యంలో వెల‌సిన స‌తీస‌మేత శ్రీ శ్రీ‌దేవి, భూదేవి, శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించారు. తాండూరు నియోజ‌క‌వ‌ర్గ‌ ప్ర‌జ‌ల‌ను భ‌క్తుల‌ను సుభిక్షంగా చూడాల‌ని స్వామి వారిని వేడుకున్నారు.