రైతు సంబరాలు అదిరిపోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతు సంబరాలు అదిరిపోవాలి
– రైతు వేదికల వద్ద దశాబ్ది ఉత్సవాలు
– రేపటి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు
– రైతులను భారీగా తరలించాలి
– తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దశాబ్ది ఉత్సవాల్లో రైతు సంబరాలను అదిరేలా నిర్వహించాలని తాండూరు ఆర్టీఓ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాండూరు మండలంలోని ఐనెల్లి, కరణ్ కోట్, బెల్కటూర్, సిరిగిరిపేట్, చెంగోల్ గ్రామాల్లో రైతు వేదికలను సందర్శించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగగంగా శనివారం నిర్వహించే ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ రైతు వేదిక క్లస్టర్లలో జాతీయ గీతాలతో వేడుకలను ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, రైతు బంధు, రైతు బీమా, విద్యుత్ వంటి వాటిపై కార్యక్రమాలతో రైతును చైతన్య పరచాలన్నారు. ప్రతి రైతు వేదికలలో వెయ్యి మంది రైతులను తరలించి సామూహిక భోజనాలను నిర్వహించాలన్నారు. దశాబ్ది ఉత్సవాలకు రైతులను భారీగా తరలించి జయప్రదం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, వ్యవసాయ శాఖ ఏడీ రుద్రమూర్తి, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ రాంలింగారెడ్డి, కరణ్ కోట్ సర్పంచ్ వీణ హేమంత్ కుమార్, ఉపసర్పంచ్ హేమంత్ కుమార్, ఏఓ రజిత, న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
త్వరలో నా పెళ్లి..!
– నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను
– కోర్టులో రిమాండ్‌ ఖైదీ హంగామా
– కోర్టులోనే తలుపు అద్దాలు ధ్వసం
https://dharshininews.com/17509

chaithany collage