విద్యుత్ విజయంలో తెలంగాణ ఆదర్శం

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యుత్ విజయంలో తెలంగాణ ఆదర్శం
– పథకాల అమల్లో అధికారుల కృషి కీలకం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– అట్టహాసంగా విద్యుత్ విజయోత్సవ సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ విజయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తాండూరు నియోజకవర్గ తెలంగాణ విద్యుత్ రంగ విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ సంబరాలకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు తెంలగాణ ఏర్పాటు తరువాత విద్యుత్ రంగంలో సాధించిన వివరాలను వివరించారు. ప్రభుత్వం తీసుకవచ్చిన పథకాలపై చైతన్య పరిచారు. అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఆంధ్రాపాలనలో ఆంధ్రాకారం ఉంటే నేడు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త అనే విధంగా పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ రంగ అభివృద్ధిలో శాఖా అధికారుల పనితీరు కీలకమన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో వారి కృషి వల్ల తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మరోవైపు విద్యుత్ విజయోత్సవ సంబరాలలో భాగంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల దూందాం వేడుకలు అదిరిపోయాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఆర్డీఓ అశోక్ కుమార్, డీఈ భానుప్రసాద్. ఇంచార్జ్ ఏడీ శ్రీనివాస్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా సర్సింలు, వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, డివిజన్ విద్యుత్ ఏఈలు రఘు, భాను ప్రకాష్, వెంకట్ వాయుడు, సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పిడుగుల భీభత్సం

chaithany collage