సర్కారు బడి విద్యార్థులకు దశాబ్ది కానుక

ఆరోగ్యం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

సర్కారు బడి విద్యార్థులకు దశాబ్ది కానుక
– 20 నుంచి అన్ని స్కూళ్లలో అల్పాహారం
– ప్రేయర్‌కు ముందే రాగిజావ పంపిణీ
– ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో సర్కారు బడి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది కానుకను అందించనుంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించే విద్యా దినోత్సవం నుంచి అన్ని స్కూళ్లలో అల్పాహారం అందించే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టిఫిన్‌గా రాగిజావ అందించనున్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ పనితీరు, విద్యా దినోత్సవంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ ప్రేయర్‌ సమయానికి ముందే ప్రతి విద్యార్థికి 250 మిల్లీలీటర్ల రాగిజావ అందిస్తామని తెలిపారు. దీనివల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 16,27,457 మంది విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్‌బుక్స్‌, ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 12,39,415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒకో నోటు పుస్తకం చొప్పున అందిస్తామని మంత్రి తెలిపారు.1,600 పాఠశాలల్లో నిర్మించిన 4,800 డిజిటల్‌ తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిచనున్నట్టు పేర్కొన్నారు. 26 లక్షల మంది విద్యార్థులకు రెండేసి జతల యూనిఫామ్‌లను అందిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage