ఎవ్వరు ఆధైర్య పడకండి..!
– జీవన్గి బ్రిడ్జి భూనిర్వాసితులకు పైలెట్ భరోసా
– అప్రోచ్ రోడ్డు పరిహారం ఇప్పించే బాధ్యత
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎవ్వరు ఆధైర్య పడోద్దని.. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని జీవన్గీ బ్రిడ్జి భూ నిర్వాసితులకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భరోసా ప్రకటించారు. అప్రోచ్ రోడ్డులో రైతులకు పరిహారం అందించే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఓ ప్రకటనలో మాట్లాడుతూ బషీరాబాద్ మండలం జీవన్గి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు వరకు రోడ్డు పనులను అడ్డుకోవద్దని కోరారు. ఈ అప్రోచ్ రోడ్డు పూర్తయితే ఎంతోమంది ప్రజల రవాణా సౌకర్యానికి అనువుగా ఉంటుందని అన్నారు. పరిహారంపై భూనిర్వాసిత రైతులు ఆందోళన చెందొద్దని అన్నారు. రైతులు ప్రతిపక్షాల మాయలో పడి అపోహలకు గురికావద్దని సూచించారు. మీ బిడ్డగా రైతులకు రావాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం నుంచి అందజేసేలా బాధ్యత తీసుకుంటానని అన్నారు. అప్పటి వరకు రోడ్డు పనులను అడ్డుకోవద్దని, రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు అందరు సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి…


