లోకల్ వాళ్లకే కొలువులివ్వాలి
– కర్మాగారంలో సిమెంట్ ఉత్పత్తులపై దృష్టి పెంచండి
– ఐసీఎల్ కర్మాగార అధికారులకు మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలోని ఇండియా సిమెంట్ కర్మాగారల్లో లోకల్ వాళ్లకే కొలువులు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా. పి. మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో ఇండియా సిమెంట్ కర్మాగారం(ఐసీఎల్) ఉన్నత అధికారి రమేష్, అధికారులు దక్షిణామూర్తి, పృథ్వీరాజ్ తదితరులు మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చాలు అందించి, సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి అధికారులకు ఇండియా సిమెంట్ పరిశ్రమలున్న తాండూరు ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేలా చూడాలని కర్మాగారం ప్రతినిధులకు సూచించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. భూములు కోల్పోయిన వారికి ఇంకా ఎంతకాలం ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటారని గట్టిగా ప్రశ్నించారు. తాండూరు ప్రాంతంలోని ఇండియా సిమెంట్ తో పాటు ఇతర పరిశ్రమలలో స్థానికులు సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.
అదేవిధంగా పరిశ్రమలలో ఉత్పత్తి పెంచి తెలంగాణ రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని అన్నారు. మంత్రి ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామని ఉన్నతాధికారులు రమేష్, దక్షిణామూర్తి, పృథ్విరాజ్ తెలిపారు.
ఇది కూడా చదవండి…

