గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో..!
– కోటబాస్పల్లిలో 14వ వర్ధంతి
– తండ్రికి నివాళులు అర్పించిన నర్సింహారెడ్డి(బాబు)
– వర్ధంతికి తరలివచ్చిన నాయకులు, అభిమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల మాజీ ఎంపీపీ స్వర్గీయ గొట్టిగ మహిపాల్ రెడ్డి యాదిలో మండలంలోని కోటబాస్పల్లి గ్రామం గడిపింది. మంగళవారం కోటబాస్పల్లిలో గొట్టిగ మహిపాల్ రెడ్డి 14వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన తనయుడు, రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు, తాండూరు సిటీ కేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డి (బాబు) హాజరయ్యారు. గ్రామంలోని స్మృతివనంలో ఉన్న తండ్రి గొట్టిగ మహిపాల్ రెడ్డి సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నర్సింహారెడ్డి, పలువురు మాట్లాడుతూ ఎంపీపీగా స్వర్గీయ మహిపాల్ రెడ్డి చేసిన సేవలను, గ్రామాభివృద్ధికి అందించిన సహాకారాన్ని గుర్తుచేసుకున్నారు. మహిపాల్ రెడ్డి సేవలు గుర్తుండి పోతాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గొట్టిగ రాంరెడ్డి, గొట్టిగ రాజశేఖర్ రెడ్డి, బురానుద్దీన్, గౌసోద్దీన్, వివి రెడ్డి, పోలీస్ వెంకటయ్య, నరసింహులు, దేవనూర్ నరసింహ, ఎరుకల క్రిష్టప్ప, పీఆర్టియు నాయకులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, విద్యా కమిటీ కమిటీ మాజీ చైర్మన్ రాములు, విద్యా కమిటీ చైర్మన్ వడ్డే సురేష్, అవుసుల నరేందర్, కొండను రవి, నరసింహ గౌడ్, రమేష్, వడ్డే హనుమంతు, వడ్డే చెన్నయ్య, వార్డు సభ్యులు నరసింహ, మాల సూరి, చాకలి నర్సింలు, మాల అంజిలప్ప, బూరుగుపల్లి సైదప్ప, సిహెచ్ అశోక్, తిరుపతి, విజయ్ కుమార్, గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అధికారులపై దాడి గుండాల కుట్ర..!