సీటీ స్కాన్ సేవలు షురూ..!
– జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో
– సద్వినియోగం చేసుకోండి: సూపరిండెంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలోని సీటీ స్కాన్ మరమ్మత్తులకు గురికావడంతో సేవలు స్థంభించిపోయాయి. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడేవారు. ప్రైవేటులో సేవలను పొంది ఆర్థికంగా అవస్థలు పడ్డారు. మరమ్మత్తులపై ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్ దృష్టిసారించారు. ఆలస్యమైనా సీటీ స్కాన్ మిషన్‌కు మరమ్మత్తులు చేయించారు. తాజాగా బుధవారం నుంచి ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేదలు ప్రైవేటుకు వెళ్లకుండా ఆసుపత్రిలోనే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఆసుపత్రికి వచ్చే రోగులు సీటీ స్కాన్ సేవలను పునరుద్దరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి….


