అభిమానులు మా కుటుంభీకులు..!
– మా జీవితం కార్యకర్తలకే అంకితం
– అభిమానుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరిక
– జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి
– తాండూరు యువతకు పీఎమ్మార్ ట్రస్టు ద్వారా చేయూత
యాలాల, దర్శిని ప్రతినిధి : మా అభిమానులు మా కుటుంబ సభ్యులతో సమానమని వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు, అభిమానుల కోసం చివరి రక్తం బొట్టు వరకు మా కుటుంభం పనిచేస్తామని హామీ ఇచ్చారు. శనివారం యాలాల మండలం జుంటుపల్లి రామలింగేశ్వర ఆలయం వద్ద బషీరాబాద్ మండలం పర్వత్‌పల్లి గ్రామానికి చెందిన సునీతమ్మ అభిమాని చాంద్‌పాషా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సునీతమహేందర్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరై అభిమానులు, కార్యాకర్తలతో ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా, మంత్రిగా మహేందర్‌రెడ్డి, మూడు సార్లు జెడ్పీ చైర్‌పర్సన్‌గా తాను అభివృద్ధి చేశామని అన్నారు. 20 ఏళ్ల నుంచి కాలేజీలు నడుపుతూ రాజకీయాలుచేశామని, అందులోని కొంత డబ్బు తాండూరు ప్రాంత ప్రజలకు, యువతకు చేయూత ఇవ్వడానికి కృషి చేస్తున్నామని అన్నారు. రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఎవరైన మా అభిమానుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అన్నదానం చేసిన చాంద్‌పాషాను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కరణం పురుషొత్తం రావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, నాయకులు సుదాకర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్, తాండూరు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


