పాహిమాం.. శాకాంబరీ మాత..!
– రక్తమైసమ్మ, కట్ట మైసమ్మలకు ప్రత్యేక అలంకరణ
– పూజలు నిర్వహించి దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాహిమాం.. శాకాంబరీ మాతా అంటూ భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో అషాడం సందర్భంగా శాకాంబరీ ఉత్సవాలు జరుపుకున్నారు. పట్టణంలోని మర్రిచెట్టు కూడలి వద్ద వెలసిన రక్తమైసమ్మతో పాటు గుమాస్తా నగర్‌లో వెలసిన కట్ట మైసమ్మలకు శాకాంబరీ అలంకరణ చేశారు. ఆకు కూరలు, కూరగాయలతో చేసిన అలంకరణలో అమ్మవార్లు ప్రత్యేక దర్శనం ఇచ్చారు. శాకాంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని ఆయా దేవాలయాలలో వెలసిన అమ్మవార్లను ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. పాహిమాం.. తల్లీ, శాకాంబరీ నమోస్తుతే.. అంటూ అమ్మవారికి పూజలు నిర్వహించారు. దీంతో శాకాంబరీ ఉత్సవాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఇది కూడా చదవండి…


