ఎంపీ రంజిత్‌రెడ్డికి శుభాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆయనను కలిశారు. మొక్కను అందజేసి.. శాలువాతో సత్కరించారు. అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, సీనీయర్ నాయకులు శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మహిళ నాయకురాలు శకుంతల, యాలాల మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
