– ప్రత్యేక అలంకరణలో శివుడు
దర్శిని ప్రతినిధి, తాండూరు : నమో సుందరేశ్వర స్వామి అంటూ భక్తులు పట్టణంలోని భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయంలో వెలసిన శివున్ని దర్శించుకున్నారు. శ్రావణమాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ పూజారి విజయ్‌కుమార్ స్వామి శివున్ని
ప్రత్యేకంగా అలంకరించారు. చిలుకూరు బాలాజీ దేవస్థానంలో వెలసిన సుందరేశ్వర స్వామిగా శివున్ని అలంకరించారు. సాయంత్రం ఆలయానికి వచ్చిన భక్తులు సుందరేశ్వర స్వామిగా దర్శనమిచ్చిన శివున్ని దర్శించుకుని పూజించారు.
