ఆరుటితోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు
– నిర్ణయించిన తెలంగాణ విద్యాశాఖ
– ఉత్తర్వులు జారీ చేసిన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: 2021-22 విద్యాసంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు పది పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 11 పేపర్‌ల కారణంగా పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతాయి. ఇది విద్యార్థులకు ఇబ్బందిగా మారో అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కరోనా మళ్లీ ఎప్పుడు ఉగ్రరూపం దాల్చుతుందో తెలియని నేపథ్యంలో విద్యా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 11 ప్రశ్నా పత్రాలకు ఉండగా వీటిని 6 కుదిస్తూ విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపరే పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో నెలకొన్ని పరిస్థిల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌ను పరిగణిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు ఎంతో లాభం చేకూర్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2022 నాటి పదో పరీక్షలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

